Lakshya Sen : చెదిరిన కల.. ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ రన్నరప్‌గా లక్ష్యసేన్‌

కెరీర్లో అతిపెద్ద టోర్నీ విజేతగా నిలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవలి కాలంలో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న ఈ యువసంచలనం ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బరిలో ఓటమిపాలయ్యాడు.

Updated : 20 Mar 2022 23:23 IST

బర్మింగ్‌హామ్‌: కెరీర్లో అతిపెద్ద టోర్నీ విజేతగా నిలిచి చరిత్ర సృష్టిద్దామనుకున్న భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవలి కాలంలో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న ఈ యువసంచలనం ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బరిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈ మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. తొలిసారి పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ చేరిన లక్ష్యసేన్‌.. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో వరుస గేముల్లో 10-21, 15-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లీ జియాను ఓడించి బంగారు పతకంపై కన్నెసిన లక్ష్యసేన్‌.. ఏకపక్షంగా సాగిన ఫైనల్‌ పోరులో ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేశాడు. ఆల్‌ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో ఇప్పటిదాకా ముగ్గురే భారత షట్లర్లు ఫైనల్స్‌ చేరారు. 1980లో ప్రకాశ్‌ పదుకొనే, 2001లో పుల్లెల గోపీచంద్‌ టైటిళ్లు సాధించగా.. 1947లో ప్రకాశ్‌ నాథ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఇక మహిళల్లో సైనా మాత్రమే ఆల్‌ఇంగ్లాండ్‌ ఫైనల్‌ ఆడింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని