FIFA: మెరిసిన మెస్సీ.. మురిసిన అర్జెంటీనా..!
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కళ్లుచెదిరే గోల్‌తో మెరిసిన లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా రికార్డును బద్దలుకొట్టాడు.
ఖతార్: ఫిఫా ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో పరాజయం పాలైన అర్జెంటీనా ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. శనివారం రౌండ్-16లో ఆస్ట్రేలియాతో పోరులో 2-1 తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. తన 1000వ మ్యాచ్‌లో కళ్లు చెదిరే గోల్‌తో ఆకట్టుకున్న కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా రికార్డును బద్దలుకొట్టాడు. ఈ ప్రపంచకప్ రౌండ్-16(నాకౌట్దశ)లో చేసిన తొలి గోల్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మెస్సీ 3 గోల్స్ సాధించాడు. దీంతో అతడి కెరీర్లో ఫిఫా ప్రపంచకప్‌లలో కొట్టిన మొత్తం గోల్స్ సంఖ్య 9కి చేరింది. అర్జెంటీనా తరపున ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరుకొన్నాడు. గతంలో ఈ స్థానంలో డీగో మారడోనా ఉండేవాడు. అర్జెంటీనా తరపున ఫీఫా కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన వారిలో గాబ్రియెల్ బటిస్టుటా (10) తొలి స్థానంలో ఉన్నాడు.
పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(సీఆర్-7) కంటే మెస్సీ మెరుగైన రికార్డు సాధించాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమ ఆటగాడు అనే చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. రొనాల్డో తన 1000వ అంతర్జాతీయ మ్యాచ్‌ను 2020లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతడు 725 గోల్స్ చేయగా మరో 216 గోల్స్ చేసేందుకు సహకరించాడు. ఇక మెస్సీ అంతర్జాతీయ కెరీర్లో 1000వ మ్యాచ్‌ను తాజాగా ఆస్ట్రేలియాతో ఆడాడు. తన కెరీర్లో మొత్తం 789 గోల్స్ చేయగా.. 348 గోల్స్‌కు సహకారం అందించాడు. రొనాల్డో ఖాతాలో 31 ట్రోఫీలు .. మెస్సీ వద్ద 41 ఉన్నాయి. రికార్డుల పరంగా మెస్సీ చాలా మెరుగ్గా ఉన్నట్లే లెక్క. తాజా గెలుపుతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న అర్జెంటీనా తన తదుపరి పోరులో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు