Lionel Messi: మెస్సికి అరుదైన గౌరవం.. ఫుట్‌బాల్‌ దిగ్గజాల సరసన విగ్రహం

  అర్జెంటీనా వాసుల ప్రపంచకప్‌ కలను  నిజం చేసిన వీరుడు లియోనల్‌ మెస్సి (Lionel Messi). దీంతో కాన్‌మెబాల్‌ మ్యూజియంలో ఫుట్‌బాల్‌ దిగ్గజాలు పీలే, డిగో మారడోనా పక్కన మెస్సి ప్రతిమను ఏర్పాటు చేశారు. 

Published : 29 Mar 2023 00:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లియోనల్‌ మెస్సి (Lionel Messi)..ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ కోసం అర్జెంటీనా వాసుల 36 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించాడు. అతడిని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ సమాఖ్య (CONMEBOL) సోమవారం సత్కరించింది. ఫుట్‌బాల్‌ దిగ్గజాలు పీలే, డిగో మారడోనా పక్కన కాన్‌మెబాల్‌ మ్యూజియంలో మెస్సి ప్రతిమను ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు ముందు అతడు ప్రపంచకప్‌తో పాటు ఫైనలిసిమా ట్రోఫీ (Finalissima trophy)ని కూడా అందుకున్నాడు. ‘‘మేము ప్రత్యేకమైన, అందమైన సందర్భాన్ని ఆస్వాదిస్తున్నాను. చాలా ప్రేమను పొందుతున్నాము.  మరోసారి ప్రపంచకప్‌ గెలవడానికి దక్షిణ అమెరికాకు సమయం ఆసన్నమైంది’’ అని మెస్సిపేర్కొన్నాడు. 

గతేడాది ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ప్రపంచ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.  ప్రపంచకప్‌ జట్టుకు సారథ్యం వహించిన మెస్సికి నాటి నుంచి పలు సత్కారాలు అందుతున్నాయి.  బ్యూనస్‌ ఎయిర్స్‌లోని కాసా ది ఎజీజా ప్రాంతాన్ని ‘లియోనెల్‌ ఆండ్రెస్‌ మెస్సి’ పేరుతో పిలుచుకుంటున్నట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (AFA) అధ్యక్షుడు క్లాడియో టాపియా (Claudio Tapia) ట్వీట్‌ చేశాడు. మెస్సి బస చేసిన హోటల్‌ రూమ్‌ని మ్యూజియంగా మార్చాలని ఇటీవల ఖతార్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని