Lionel Messi: మెస్సికి అరుదైన గౌరవం.. మ్యూజియంగా మారనున్న బస చేసిన రూమ్‌

ఫిఫా ప్రపంచకప్‌తో తన కలను నెరవేర్చుకున్న అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియొనల్‌ మెస్సిని ఖతార్‌ అరుదైన రీతిలో గౌరవించాలని నిర్ణయించింది. అతడు బస చేసిన హోటల్‌ రూమ్‌ని మ్యూజియంగా మార్చడానికి ఏర్పాట్లు చేస్తోంది. 

Updated : 30 Dec 2022 17:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఖతార్‌లో ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌(Fifa World Cup)లో అర్జెంటీనా ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు స్టార్‌ ఆటగాడు లియొనల్‌ మెస్సి (Lionel Messi) ప్రపంచకప్‌ కల నెరవేరింది. ఈ వరల్డ్‌కప్‌ మొత్తం 7 గోల్స్‌ చేసిన అతడు ‘గోల్డెన్‌ బాల్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో మెస్సికి ఈ ప్రపంచకప్‌ చిరకాలం గుర్తుండిపోయేలా ఖతార్‌ ఏర్పాట్లు చేస్తోంది. మెస్సి బస చేసిన హోటల్‌ రూమ్‌ని మ్యూజియంగా మార్చాలని నిర్ణయించినట్లు ఖతార్‌ యూనివర్సిటీ ప్రకటించింది. ఇక నుంచి ఆ రూమ్‌ని బస కోసం కేటాయించమని పేర్కొంటూ చిన్న మ్యూజియంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది. 

‘అర్జెంటీనా (Argentina)  జాతీయ జట్టు ఆటగాడు లియొనల్‌ మెస్సి బస చేసిన రూమ్‌లో ఎటువంటి మార్పులు చేయడం లేదు. ఇక నుంచి దాన్ని పర్యాటకుల బస కోసం కేటాయించకుండా కేవలం సందర్శనకు మాత్రమే అందుబాటులో ఉంచుతాం. మెస్సి సాధించిన గొప్ప ఘనతలను విద్యార్థులకు, భవిష్యత్‌ తరాలకు తెలియజేయడానికే ఇలా చేస్తున్నాం’ అని ఖతార్‌ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని