Mohammed Azharuddin: అతడు 50, 60 పరుగులు సాధిస్తే సరిపోదు.. సెంచరీలు కొట్టాలి: అజహరుద్దీన్

టీమ్‌ఇండియా తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి ఇంగ్లాండ్‌ పర్యటనలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 03 Jun 2022 13:15 IST

(Photo: Mohammad Azharuddin Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి ఇంగ్లాండ్‌ పర్యటనలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ అభిప్రాయపడ్డాడు. జట్టులోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకోలేని అతడు.. సెంచరీలు సాధిస్తేనే దీర్ఘకాలం జట్టులో కొనసాగుతాడని చెప్పాడు. వచ్చేనెల ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో విహారి ఒకడు. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అజహరుద్దీన్‌ అతడిపై ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘విహారి భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. అతడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సెంచరీలు సాధించాలి. కేవలం 50, 60 పరుగులు సాధిస్తే ప్రయోజనం లేదు. విహారి చాలా మంచి ఆటగాడు. అతడు భారీ ఇన్నింగ్స్‌ ఆడితేనే సుదీర్ఘకాలం టీమ్‌ఇండియాలో కొనసాగుతాడు’ అని అజహరుద్దీన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, టీమ్‌ఇండియా గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగు మాత్రమే ఆడింది. ఐదో టెస్టుకు ముందు కొవిడ్‌ కేసులు నమోదవ్వడంతో దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు అదే టెస్టును జులై 1 నుంచి నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని