WAC: ఫైనల్‌కు దూసుకెళ్లిన జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్​రౌండ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు. 

Published : 22 Jul 2022 08:04 IST

యుజీన్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్​రౌండ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు. 

ఇటీవలే స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. అయితే 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీ మీటర్ల దూరంలో నిలిచిపోయాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్‌లో నీరజ్‌ ఎంత దూరం వరకు జావెలిన్‌ను విసురుతాడనేది ఆసక్తికరంగా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని