World Cup - NED vs SL: శ్రీలంక బౌలర్ల జోరు.. నెదర్లాండ్స్‌ ఆరు వికెట్లు డౌన్

ప్రపంచకప్‌లో మూడుకు మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న శ్రీలంక.. ఎట్టకేలకు బోణీ కొట్టేలా కనిపిస్తోంది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లంక పట్టుబిగించింది.

Updated : 21 Oct 2023 12:46 IST

లఖ్‌నవూ: ప్రపంచకప్‌లో మూడుకు మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న శ్రీలంక.. ఎట్టకేలకు బోణీ కొట్టేలా కనిపిస్తోంది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లంక పట్టుబిగించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌ బ్యాటర్లకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో 24 ఓవర్లకు నెదర్లాండ్స్‌ 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (7*), వాన్‌ బీక్ (6*) పరుగులతో క్రీజులో ఉన్నారు.

 ఓపెనర్ విక్రమ్‌జిత్ (4)ను కాసున్ రజిత ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపగా..  మరో ఓపెనర్ మాక్స్‌ ఔడౌడ్ (16), కోలిన్ అకెర్మాన్ (29) నిలకడగా ఆడటంతో నెదర్లాండ్ కాస్త గాడినపడ్డట్లే కనిపించింది. ఈ క్రమంలో ఔడౌడ్, అకెర్మాన్‌ వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. వీరిద్దరిని కూడా రజితనే ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన బాస్‌ డి లీడే (6), తేజ నిడమనూరు (9)ని దిల్షాన్‌ మధుశంక వెనక్కిపంపాడు. బాస్‌ డీ లీడే కుశాల్ పెరీరాకు క్యాచ్‌ ఇవ్వగా.. తేజ నిడమనూరు వికెట్ల ముందు దొరికిపోయాడు. కాసేపు నిలకడగా ఆడిన స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (16)ని మహీశ్ తీక్షణ బౌల్డ్ చేశాడు. దీంతో నెదర్లాండ్స్‌ 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని