T20 World Cup 2024 : కొత్త ఫార్మాట్‌లో వచ్చే టీ20 సమరం.. వివరాలివే..

2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. కొత్త ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ వివరాలను ఐసీసీ వెల్లడించింది.

Updated : 22 Nov 2022 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  పురుషుల పొట్టి ప్రపంచకప్‌ ఇటీవలే ముగిసింది. 2024లో జరిగే మరో మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. అయితే.. వచ్చే టీ20 ప్రపంచకప్‌ భిన్నమైన ఫార్మాట్‌లో జరగనుండటం విశేషం. 2021, 22 ఎడిషన్లలో మొదటి రౌండ్‌(క్వాలిఫయర్‌) అనంతరం సూపర్‌ 12 దశను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. వచ్చే టోర్నీలో మొత్తం 20 టీమ్‌లు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఐసీసీ కొత్త ఫార్మాట్‌ వివరాలను వెల్లడించింది.

2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.

ఇవి ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. ఆ తర్వాత అసలైన పోరు సూపర్‌ 8 స్టేజ్‌లో ఉండనుంది.

మొత్తం నాలుగు గ్రూపుల్లో.. ప్రతి గ్రూప్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్‌ 8 దశకు చేరుకుంటాయి.

సూపర్‌ 8 దశలో నాలుగేసి జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడుతాయి.

సూపర్‌ 8లోని రెండు గ్రూపుల్లో టాప్‌ 2 స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడతాయి.

సెమీస్‌లో విజేతలతో ఫైనల్‌ పోరు నిర్వహిస్తారు.

బెర్తులను ఖరారు చేసుకున్న 12 జట్లు..

వెస్టిండీస్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆతిథ్యం ఇచ్చే 2024 ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే 12 జట్లు తమ బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఆతిథ్య దేశాలుగా విండీస్‌, యూఎస్‌ఏ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఇటీవల ఆసీస్‌లో నిర్వహించిన ప్రపంచకప్‌ సూపర్‌ 12 స్టేజ్‌ నుంచి టాప్‌ 8 జట్లు 2024 టోర్నీలో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాత.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ఆధారంగా అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు స్థానం సంపాదించుకున్నాయి.

ఇక మిగిలిన 8 స్థానాల కోసం జట్లను రీజినల్‌ క్వాలిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు.

గత టీ20 టోర్నీల్లో వెనకబడ్డ జింబాబ్వే వంటి దేశాలు క్వాలిఫై రౌండ్‌ ఆడాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని