Australia Open : ఆస్ట్రేలియా ఓపెన్‌ ‘సింగిల్స్‌’లో భారత్‌కు దక్కని ప్రాతినిధ్యం

ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఈ సారి సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు...

Published : 14 Jan 2022 01:37 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఈ సారి సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఎవరూ అర్హత సాధించలేకపోయారు. టీమ్‌ఇండియా ఆటగాడు యుకీ బాంబ్రి తన రెండో రౌండ్‌ క్వాలిఫయిర్స్‌ మ్యాచ్‌లో 1-6, 3-6 తేడాతో టామస్‌ మచాక్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్‌కు ఉన్న చివరి ఆశలు ఆవిరయ్యాయి. చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు టామస్ ఆది నుంచే యుకీపై ఆధిక్యత ప్రదర్శించాడు. అయితే రెండో సెట్‌లో యుకీ కాస్త ప్రతిఘటించాడు. కానీ ఆఖరికి విజయం టామస్‌నే వరించింది.

రెండు రోజుల కిందట తొలి రౌండ్‌లో పోర్చగీస్ ఆటగాడు డొమింగూస్‌పై 6-4, 6-2 తేడాతో సులువుగా గెలిచిన యుకీ కీలకమైన రెండో రౌండ్‌లో మాత్రం తేలిపోయాడు. మహిళల సింగిల్స్‌ క్రీడాకారిణి అంకితా రైనా కూడా ఓడిపోయింది. ఉక్రెయిన్‌ ప్లేయర్‌ లెసియా సురెంకో చేతిలో 6-1, 6-0 తేడాతో పరాజయం పాలైంది. మరో భారత ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని