PAK vs AUS: స్మిత్‌.. డీఆర్‌ఎస్‌కు వెళ్లమంటావా వద్దా?.. రిజ్వాన్‌ వీడియో వైరల్‌

ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా...

Published : 14 Mar 2022 02:10 IST

(Photo: Pakistan Cricket Board Twitter Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రెండు వికెట్లు పడ్డాక ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, 71వ ఓవర్‌లో స్మిత్‌ 54 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా నౌమన్‌ అలీ వేసిన ఓ బంతి ప్యాడ్లకు తాకింది. దీంతో పాక్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. బంతి లెగ్‌స్టంప్‌కు బయట పిచ్‌ అవడంతో పాకిస్థాన్‌ ఆటగాళ్లు డీఆర్‌ఎస్‌కు వెళ్లాలా వద్దా అనే డైలామలో పడ్డారు. అదే సమయంలో పాక్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌.. స్టీవ్‌స్మిత్‌తో మాట్లాడుతూ రివ్యూకు వెళ్లమంటావా వద్దంటావా? అని సరదాగా అడిగాడు. ఆ సమయంలో స్మిత్‌ భుజాలపై చేతులేసి మరీ మాట్లాడటం గమనార్హం. ఆ వీడియోను పాక్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో పంచుకోవడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు కొంత మంది నవ్వుకుంటుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక చివరికి పాక్‌ జట్టు రివ్యూకు వెళ్లకపోవడంతో స్మిత్‌ అప్పుడు బ్యాటింగ్‌ కొనసాగించాడు. కానీ, అతడు 72 పరుగులు చేశాక ఔటయ్యాడు. మీరూ ఆ వీడియో చూసి ఎంజాయ్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని