Rishabh pant: దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా సెలక్షన్‌

Published : 08 Jun 2022 19:49 IST

దిల్లీ: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా సెలక్షన్‌ కమిటీ నియమించింది. స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గురువారం రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈనెల 12న కటక్‌లో, 14న విశాఖపట్నంలో, 17న రాజ్‌కోట్‌లో, 19న బెంగళూరులో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ రెండు జట్ల సన్నాహకాలకు ఉపయోగపడనుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 15వ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్‌తో పాటు మంచి ఫామ్‌లో ఉన్న డికాక్‌తో సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది. వీళ్లతో పాటు రబాడ, నోకియా, ప్రిటోరియస్‌, వాండర్‌ డసెన్‌, మార్‌క్రమ్‌ లాంటి కీలక ఆటగాళ్లూ ఆ జట్టులో ఉన్నారు. మరి పటిష్ఠంగా ఉన్న ప్రత్యర్థితో సిరీస్‌లో భారత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

భారత జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, వెంకటేశ్‌ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్‌ పటేల్, రవి బిష్నోయ్‌, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని