Cameron Green : ఆ విషయాన్ని నమ్మలేకపోయా.. నన్ను నేను గిల్లి చూసుకున్నా : కామెరూన్ గ్రీన్

తనను ముంబయి జట్టు ఎంపిక చేసుకోవడంపై ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్‌ కామెరూన్ గ్రీన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఛాంపియన్‌ జట్టులో చేరడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

Published : 24 Dec 2022 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఐపీఎల్‌ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్‌ కామెరూన్ గ్రీన్ అదరగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా నిలిచి సత్తా చాటాడు. అతడిని ముంబయి ఇండియన్స్‌ రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని.. తనను తాను గిల్లి చూసుకున్నానని గ్రీన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన జట్టులో చేరడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

‘ఈ వేలంపాట చూడటం ఓ విచిత్రమైన అనుభూతి. ఐపీఎల్‌ వేలం పాట సమయంలో నేను ఎంతో ఆందోళనకు గురయ్యా. ఇక కొనుగోలు ప్రక్రియ ముగియగానే నాలో షేకింగ్‌ ప్రారంభమైంది. నేను ఐపీఎల్‌కు పెద్ద అభిమానిని. ఇక ముంబయి ఇండియన్స్‌ జట్టు ఈ పోటీలో పవర్‌హౌజ్‌లాంటిది. ఆ జట్టులో చేరడం గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ టోర్నీ కోసం వచ్చే ఏడాది వరకు ఆగలేకపోతున్నాను’’ అని గ్రీన్‌ పేర్కొన్నాడు.

ఈ యువ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు వేలంలో దిల్లీ, ముంబయి జట్లు పోటీ పడ్డాయి. చివరికి ముంబయి జట్టే అతడిని దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని