PM Modi: ప్రధాని మోదీని కలిసిన థామస్‌ కప్‌ ఛాంపియన్లు

గత ఆదివారం థామస్‌ కప్‌ సాధించి భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్‌ బృందం ఈ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యింది...

Updated : 22 May 2022 13:12 IST

(Photo: Anurag Thakur twitter)

దిల్లీ: థామస్‌ కప్‌ సాధించి భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్‌ బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యింది. ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ వారితో కాపేపు ఆప్యాయంగా ముచ్చటించారు. అలాగే క్రీడాకారులు ఆ మెగా ఈవెంట్‌లో తమకు ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్‌లో ఫొటోలు పంచుకొని వెల్లడించారు.

థామస్‌ కప్‌.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌. ఇందులో మొన్నటిదాకా భారత జట్టు పతకమే గెలవలేదు. 1979 తర్వాత కనీసం ఈ టోర్నమెంట్లో సెమీస్‌ కూడా చేరలేదు. అలాంటిది ఈ పర్యాయం భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేస్తూ.. మేటి జట్లను మట్టికరిపిస్తూ.. ఏకంగా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించారు. బలమైన ఆటగాళ్లతో టోర్నీలో బరిలోకి దిగిన పురుషుల జట్టు.. రికార్డు స్థాయిలో 14 సార్లు టైటిల్‌ సాధించిన ఇండోనేసియాను చిత్తుగా ఓడించి టైటిల్‌ నెగ్గింది. ఫైనల్లో ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా వరుసగా మూడు విజయాలతో భారత్‌ ట్రోఫీని ముద్దాడింది. తెలుగు కుర్రాళ్లు కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ ఈ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని