Rahul Chahar: గోవాలో రాహుల్‌ చాహర్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. ఫొటోలు పంచుకున్న యువ క్రికెటర్‌

టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం అతడు గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నాడు. ఇషానీ జోహార్‌ అనే యువతిని వివాహమాడాడు...

Published : 10 Mar 2022 09:23 IST

(Photo: Rahul Chahar Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం అతడు గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నాడు. ఇషానీ జోహార్‌ అనే యువతిని వివాహమాడాడు. ఈ విషయాన్ని తెలుపుతూ అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పంచుకున్నాడు. ఈ వేడుకకు తన సోదరుడు, టీమ్‌ఇండియా క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌తో పాటు శివమ్‌ మావి హాజరయ్యాడు. కాగా, చాహర్‌ పెళ్లి కోసం అతడి కుటుంబం కొద్దిరోజులుగా గోవాలోనే ఉంది. ఇక వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన హల్దీ, మెహందీ కార్యక్రమాల ఫొటోలను కూడా రాహుల్‌ చాహర్‌ అభిమానులతో పంచుకున్నాడు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని