IPL 2022: రాజస్థాన్‌ రాయల్స్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా యార్కర్స్‌ స్పెషలిస్ట్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)కు సమయం దగ్గరపడుతోంది. మార్చి 26 నుంచి ఈ మెగా టీ20 ప్రారంభంకానుంది. దీంతో ఫ్రాంచైజీలు కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బందిని నియమించుకోవడంపై దృష్టిసారించాయి. సంజూ

Published : 11 Mar 2022 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)కు సమయం దగ్గరపడుతోంది. మార్చి 26 నుంచి ఈ మెగా టీ20 ప్రారంభంకానుంది. దీంతో ఫ్రాంచైజీలు కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బందిని నియమించుకోవడంపై దృష్టిసారించాయి. సంజూ శాంసన్‌ కెప్టెన్‌గా ఉన్న రాజస్థాన్‌ రాయల్స్ తమ బౌలింగ్‌ విభాగాన్ని పటిష్టం చేసుకునేందుకు శ్రీలంక మాజీ ఆటగాడు, యార్కర్స్‌ స్పెషలిస్ట్‌ లసిత్‌ మలింగను జట్టులోకి తీసుకుంది. రానున్న ఐపీఎల్ సీజన్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా మలింగ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. 

ప్రపంచ క్రికెట్‌లో యార్కర్స్‌ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన లసిత్‌ మలింగ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. దశాబ్దకాలం పాటు ఆ జట్టులో కీలకమైన బౌలర్‌గా ఉండి ఎన్నో విజయాలను అందించాడు. 2019లో ఆటగాడిగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు తర్వాత ముంబయి ఇండియన్స్‌కు బౌలింగ్‌ మెంటార్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు (170) తీసిన రికార్డు ఇంకా మలింగ పేరిటే ఉండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని