IPL 2021:దుబాయ్‌ చేరుకున్న విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో ఐపీఎల్-14 సీజన్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లు యూఏఈకి చేరుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆ జట్టు ఆటగాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ శనివారమే ప్రత్యేక విమానంలో అబుదాబి చేరుకోగా.. రాయల్

Published : 12 Sep 2021 23:56 IST

(Photo:Royal Challengers Bangalore Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు కావడంతో ఐపీఎల్-14 సీజన్‌లో ఆడేందుకు భారత ఆటగాళ్లు యూఏఈకి చేరుకుంటున్నారు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆ జట్టు ఆటగాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ శనివారమే ప్రత్యేక విమానంలో అబుదాబి చేరుకోగా.. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ  ఆదివారం దుబాయ్‌ చేరుకున్నారు. వీరిద్దరితోపాటు ఆర్సీబీ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ కూడా అక్కడికి వెళ్లాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘మీరందరూ ఎదురుచూస్తున్న వార్త. విరాట్ కోహ్లీ, మహ్మద్‌ సిరాజ్‌ దుబాయ్‌లో జట్టుతో కలిశారు’ అని ట్వీట్ చేసింది. మరో ఆర్సీబీ ఆటగాడు డాన్‌ క్రిస్టియాన్‌ కూడా ఆదివారం దుబాయ్‌ చేరుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌, మహ్మద్‌ షమీ, మయాంక్ అగర్వాల్‌ కూడా దుబాయ్‌ చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పంజాబ్ కింగ్స్‌ ట్వీట్‌ చేసింది.

బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో మే మొదటివారంలో ఐపీఎల్ వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ వాయిదాపడే నాటికి  ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ... ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడో స్థానంలో నిలవగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గి ఆరో స్థానంలో ఉంది. సెప్టెంబరు 19న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్-14 సీజన్‌ పున:ప్రారంభంకానుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని