Rohit Sharma : మన టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజమే నాకు స్ఫూర్తి: రోహిత్ శర్మ

 క్రికెట్‌ను ఆడేందుకు స్ఫూర్తిగా నిలిచిన ఆటగాడెవరనేది ..

Published : 06 Apr 2022 09:51 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఆడేందుకు స్ఫూర్తిగా నిలిచిన ఆటగాడెవరనేది ముంబయి సారథి రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇవాళ టీ20 లీగ్‌లో భాగంగా కోల్‌కతాతో మ్యాచ్‌ సందర్భంగా నిన్న ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఎల్లప్పుడూ సచినే స్ఫూర్తి. నాకు ఎనిమిది తొమ్మిదేళ్లు ఉన్నప్పటి నుంచి సచిన్‌ ఆటను చూస్తూనే ఉన్నా. సచిన్‌ తన కెరీర్‌లో సాధించిన అద్భుతాలనూ దగ్గరి నుంచి చూశా. దాదాపు పాతికేళ్లపాటు దేశం కోసం బాధ్యతాయుతమైన ప్రవర్తనతో జట్టును తన భుజాలపై మోశాడు. అన్ని సంవత్సరాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సాధారణ విషయం కాదు’’ అని వివరించాడు. 

ప్రస్తుతం ముంబయి జట్టుకు సచిన్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.  ‘‘కెరీరపరంగా, వ్యక్తిగతంగా సచిన్‌ ఎలా ఉన్నాడనే దానిని ఎల్లప్పుడూ నేను ఫాలో అవుతూ ఉంటా. కేవలం క్రికెట్‌లోనే కాకుండా మైదానం వెలుపల మానవతా దృక్పథంతో సచిన్‌ ఉండటం అద్భుతం. క్రికెట్‌ దిగ్గజంగా పేరుగాంచిన వ్యక్తి ఈ విధంగా వినయ విధేయలతో ఉండటం చాలా కష్టం. దానిని చేసి చూపించిన క్రికెటర్‌ సచిన్‌’’ అని రోహిత్ పేర్కొన్నాడు. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిన ముంబయి మూడో మ్యాచ్‌లోనైనా విజయం సాధించి బోణీ కొట్టాలని భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని