Ruthuraj Gaikwad: ఒకే సీజన్‌లో నాలుగు శతకాలు.. కోహ్లీ సరసన రుతురాజ్‌

విజయ్‌ హాజారే ట్రోఫీలో యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ అదరగొట్టాడు. మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు నాలుగు శతకాలు నమోదు చేశాడు. దీంతో ఒకే సీజన్‌లో 4 సెంచరీలు..

Published : 16 Dec 2021 23:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విజయ్‌ హజారే ట్రోఫీలో యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ అదరగొట్టాడు. మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు నాలుగు శతకాలు నమోదు చేశాడు. దీంతో ఒకే సీజన్‌లో 4 సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతని కంటే ముందు విరాట్‌ కోహ్లీ, పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్ ఈ ఘనత సాధించారు. 

విజయ్‌ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించినా.. ప్రి క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ‘ఎలైట్‌ గ్రూప్‌-డి’లో కేరళ, మధ్యప్రదేశ్‌ జట్లు మెరుగైన నెట్ రన్‌ రేట్‌ సాధించి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. దీంతో మహారాష్ట్ర మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సింది. ఈ విషయంపై రుతురాజ్‌ స్పందిస్తూ.. ‘మేం ఆడిన ఐదు మ్యాచుల్లో.. నాలుగింట్లో విజయం సాధించినా ప్రి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించకపోవడంతో కొంచెం బాధగా ఉంది. వేరే గ్రూపుల్లో పలు జట్లు (హిమాచల్‌, విదర్భ, తమిళనాడు, కర్ణాటక) ఆడిన ఐదింట్లో రెండు మ్యాచులు ఓడిపోయిన తర్వాతి దశకు అర్హత సాధించాయి. క్రికెట్లో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంటుంది. అయినా మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది’ అని రుతురాజ్‌ అన్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) తరఫున ఆడుతున్న రుతురాజ్‌.. గత సీజన్‌లో అత్యధిక పరుగులు (635) పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్న రుతురాజ్‌ను.. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్ల నుంచి సూచనలు వినిపిస్తున్నాయి. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని