Sachin Tendulkar: శునకమే ఆల్‌రౌండర్ అయితే?.. ఆసక్తికర వీడియోను పంచుకున్న సచిన్‌ 

భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటాడు. అలాగే,..

Published : 23 Nov 2021 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటాడు. అలాగే, ఈ రోజు కూడా టెండూల్కర్‌ ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ‘ఓ స్నేహితుడి ద్వారా ఈ వీడియో నా వద్దకు వచ్చింది. క్రికెట్లో మనం వికెట్ కీపర్లు, ఫీల్డర్లు, ఆల్‌రౌండర్లను చూసుంటాం. కానీ, ఈ శునకం చేస్తున్న పనికి మీరైతే ఏం పేరు పెడతారు?’ అని సచిన్‌ రాసుకొచ్చాడు.

ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.. ఇద్దరు పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా.. వారికి ఓ శునకం సాయం చేస్తుంటుంది. వికెట్‌ కీపింగ్‌, ఫీల్డింగ్ ఇలా అన్ని పనులు చేస్తుంటుంది. బంతిని నోట కరుచుకుని బౌలర్‌కి అందిస్తుంటుంది. ఈ శునకం క్యాచింగ్ నైపుణ్యాలకు ముగ్ధుడైన సచిన్‌ ఆ వీడియోను తన ట్విటర్‌ ద్వారా పంచుకుని ఆనందం వ్యక్తం చేశాడు. మీరూ ఆ వీడియోను చూసేయండి.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని