Sachin: ఒక్క ఓటమి ఆధారంగా జట్టును జడ్జ్‌ చేయకండి.. : సచిన్‌

సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ప్రదర్శనపై తాను కూడా నిరాశకు గురయ్యానని సచిన్‌ అన్నారు. అయితే మనం భారత క్రికెట్‌ శ్రేయోభిలాషులమని పేర్కొన్నాడు.

Published : 13 Nov 2022 10:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో రోహిత్‌ సేన దారుణ ప్రదర్శనపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీమ్‌ఇండియా అత్యంత అవమానకర రీతిలో ఓడిపోవడంపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఒక్క ఓటమి ఆధారంగా జట్టును జడ్జ్‌ చేయవద్దని విమర్శకులను కోరాడు.

‘సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ప్రదర్శనతో నేను కూడా నిరాశకు గురయ్యాను. అయితే, మనం భారత క్రికెట్‌ శ్రేయోభిలాషులం. ఈ ప్రదర్శన ద్వారా మాత్రమే మన జట్టును అంచనా వేయకూడదు. ఎందుకంటే మనం ప్రపంచ నం.1 టీ20 జట్టుగా ఉన్నాం. ఈ స్థానానికి చేరుకోవడం ఒక్క రాత్రిలో జరిగింది కాదు. కొంత కాలం పాటు మంచి క్రికెట్‌ ఆడాలి. మన జట్టు అదే చేసింది’ అంటూ సచిన్‌ వివరించాడు.

సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ చేసిన 168 పరుగులు పోటీ ఇచ్చే స్కోర్‌ కాదని సచిన్‌ అన్నాడు. ‘మనం మంచి స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయాం. అలాగే బౌలింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాం. ఇది ఘోరమైన ఓటమి’ అని పేర్కొన్నారు. అయితే, జయాపజయాలు ఆటలో భాగంగా గుర్తించాలని కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని