Boxing: భారత్‌కు మరో స్వర్ణం

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మరో పసిడిని సొంతం చేసుకుంది. 91 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ సంజీత్‌ స్వర్ణ పతకం గెలుపొందాడు. ఉత్కంఠ పోరులో కజకిస్థాన్‌ ఆటగాడు వాసిలీ లివిత్‌ను 3-2 తేడాతో మట్టికరిపించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో భారత బాక్సర్లు శివ థాపా, అమిత్‌..

Updated : 01 Jun 2021 00:22 IST

దుబాయ్‌: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మరో పసిడిని సొంతం చేసుకుంది. 91 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ సంజీత్‌ స్వర్ణ పతకం గెలుపొందాడు. ఉత్కంఠ పోరులో కజకిస్థాన్‌ ఆటగాడు వాసిలీ లివిత్‌ను 3-2 తేడాతో మట్టికరిపించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో భారత బాక్సర్లు శివ థాపా, అమిత్‌ పంఘాల్‌లు రజత పతకాలు గెలిచారు. 64 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్‌లో మంగోలియా బాక్సర్‌ చింజోరిగ్‌ చేతిలో శివ థాపా 2-3 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇక మరో భారత బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ 52 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్‌లో ఉజ్బెకిస్థాన్‌ ఆటగాడు జోయ్‌రొవ్‌ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలయ్యాడు. జోయ్‌రొవ్‌ చేతిలో అమిత్‌ ఓడిపోవడం ఇది మూడోసారి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ రెండు స్వర్ణాలను గెలిచింది. ఆదివారం జరిగిన 75 కిలోల విభాగంలో హరియాణా బాక్సర్‌ పూజారాణి  స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని