- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Shreyas Iyer: వారెవ్వా శ్రేయస్.. ఫీల్డింగ్ ఫీట్ అదుర్స్
సోషల్ మీడియాలో వైరల్
ఇంటర్నె్ట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో ఆడాలంటే జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. దాని కోసం ఆటగాళ్లు తమ నైపుణ్యాలకు పదునుపెట్టి.. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పుడసలే టీమ్‌ఇండియాలో స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొని ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఒడిసిపట్టుకోవడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేసిన వారే ప్రపంచకప్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఆటగాడు సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఫీట్ అదిరిపోయింది.
ప్రస్తుతం భారత్ జట్టు విండీస్ పర్యటనలో ఉంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్‌లో భారత క్రికెటర్లు చురుగ్గా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేసిన విధానం ఆకట్టుకుంది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సారథి నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా అశ్విన్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్ కొట్టాడు. అది సిక్స్ అని అందరూ భావించారు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న శ్రేయస్ ఎంతో తెలివిగా వ్యవహరించి ఆ బంతిని అడ్డుకున్నాడు. క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి చివరికి బంతిని మైదానం లోపలికి తోసేశాడు. దీంతో పూరన్ కేవలం రెండు పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి శ్రేయస్ ఫీల్డింగ్ ఫీట్‌ను మీరూ చూసేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
-
India News
Free mobile: స్మార్ట్‌ఫోన్ ఫ్రీ.. మూడేళ్లు ఇంటర్నెట్ ఫ్రీ.. ఆ రాష్ట్ర సర్కార్ కొత్త స్కీమ్!
-
Crime News
CBI: దిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
monkeypox: మంకీపాక్స్ నిర్ధారణ స్వదేశీ కిట్ విడుదల.. ఏపీలోనే తయారీ
-
India News
Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?