SA vs IND: 55 పరుగులకే ఆలౌట్.. చెత్త రికార్డు మూటగట్టుకున్న సఫారీలు

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకే ఆలౌటై ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

Updated : 03 Jan 2024 18:04 IST

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా (Team India) పేసర్లు అదరగొట్టారు. ముఖ్యంగా సిరాజ్‌ (Mohammed Siraj)(6/15) సఫారీలను బెంబేలెత్తించాడు. దీంతో ఆతిథ్య జట్టు 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. బెడింగ్‌హామ్ (12), వెరినే (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

సఫారీల చెత్త రికార్డు

1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు ఇదే. భారత్‌పై కూడా ఇదే అతి తక్కువ స్కోరు. అంతకుముందు 2019లో నాగ్‌పూర్‌లో 79 పరుగులకు ఆలౌటైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఓ ప్రత్యర్థి జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే. 2021లో ముంబయి వేదికగా జరిగిన టెస్టులో న్యూజిలాండ్ 62 పరుగులే చేసి ఆలౌటైంది. ఆ చెత్త రికార్డును ఇప్పుడు దక్షిణాఫ్రికా తన పేరిట నమోదు చేసుకుంది. 

టెస్టుల్లో భారత్‌పై అత్యల్ప స్కోర్లు

  • 55 - దక్షిణాఫ్రికా (కేప్ టౌన్) 2024
  • 62 - న్యూజిలాండ్ (ముంబయి) 2021
  • 79 - దక్షిణాఫ్రికా (నాగ్‌పూర్) 2015
  • 81 - ఇంగ్లాండ్ (అహ్మదాబాద్) 2021
  • 82 - శ్రీలంక (చండీగఢ్) 1990

1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టెస్టుల్లో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్లు 

  • 55- భారత్‌పై (కేప్ టౌన్) 2024
  • 73 - శ్రీలంకపై (గాలె) 2018
  • 79 - భారత్‌పై (నాగ్‌పూర్) 2015
  • 83 - ఇంగ్లాండ్‌పై (జోహనెస్‌బర్గ్) 2016
  • 84 - భారత్‌పై (జోహనెస్‌బర్గ్) 2006

టెస్టుల్లో అతి తక్కువ పరుగులు ఇచ్చి ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు 

  • 5/7 - జస్‌ప్రీత్‌ బుమ్రా.. వెస్టిండీస్‌పై (2019)
  • 6/12 - వెంకటపతి రాజు.. శ్రీలంకపై (1990)
  • 5/13 - హర్భజన్ సింగ్ వెస్టిండీస్‌పై (2006)
  • 6/15 - మహ్మద్ సిరాజ్  దక్షిణాఫ్రికాపై (2024)
  • 5/18 - సుభాష్ గుప్త పాకిస్థాన్‌పై  (1955)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని