Adam Zampa: భారత్‌లో జంపా బౌలింగ్ చూడాలని ఆశపడ్డా: శ్రీధరన్‌

భారత్‌ - ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరగనున్న బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) నేపథ్యంలో ఆస్ట్రేలియా తుది జట్టులో స్పిన్నర్‌ జంపాను తీసుకోకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ (Sridharan Sriram) అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 03 Feb 2023 23:40 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా బౌలింగ్ చూడాలని తాను ఎంతగానో ఆశించినట్టు భారత మాజీ క్రికెటర్‌, ఆస్ట్రేలియా మాజీ బౌలింగ్‌ కోచ్‌ శ్రీధరన్‌ శ్రీరామ్‌ తెలిపాడు. ఫిబ్రవరి 9న భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తుది జట్టులో జంపాను తీసుకోకపోవడంపై శ్రీరామ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘‘భారత్‌లో జంపా బౌలింగ్ చూడాలని ఆశించా. ఎందుకంటే అతడు వేగంగా బౌలింగ్ చేయగలడు. భారత పిచ్‌లపై రాణించగలడు. అతడికి భారత్‌లో టెస్టు మ్యాచులు ఆడాలని ఉంది. నాతో చాలా సార్లు చెప్పాడు. అందుకోసమే అతడు న్యూ సౌత్‌ వేల్స్‌ తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. అక్కడ అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక్కో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ పర్యటనలో అతడికి చోటు దక్కకపోవడం దురదృష్టం’’ అని శ్రీరామ్‌ తెలిపాడు.

సిడ్నీలో న్యూ సౌత్‌ వేల్స్‌ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్‌ జంపా భారత్‌ పర్యటనకు ఆసీస్‌ తుది జట్టులో ఎంపిక అవుతాడని అందరూ ఆశించారు. కానీ ఆస్ట్రేలియా సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌కి తోడుగా మిచెల్‌ స్వెప్సాన్‌, యాష్టన్‌ అగర్‌, టాడ్‌ ముర్ఫీలకు అవకాశమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని