IPL 2021: సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ అందుకే ఫామ్‌లో లేరు: సునీల్ గావస్కర్

ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశలో ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌కిషన్‌ రాణించకపోవడంపై టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ విచారం వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు రిలాక్స్‌ అయ్యారని,

Published : 06 Oct 2021 01:24 IST

(Photo: Surya Kumar Yadav Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశలో ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌కిషన్‌ రాణించకపోవడంపై టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ విచారం వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు రిలాక్స్‌ అయ్యారని, పరుగులు చేయాలనే తపన వారిలో కనిపించడం లేదన్నారు.

సూర్యకుమార్ యాదవ్‌ గత ఐదు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోరు (33) చేశాడు. ఇదొక్కటి చాలు అతడు ఏ విధంగా ఆడుతున్నాడో వివరించడానికి. ఇషాన్‌ కిషన్‌ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండటంతో కొన్ని మ్యాచ్‌ల్లో తుదిజట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్.. వీరి ఆటతీరుపై మాట్లాడారు. ‘టీమ్‌ఇండియా అరంగేట్రం చేసిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ కొంచెం రిలాక్స్‌ అయినట్టు నాకనిపిస్తోంది. ఇది కాకపోయి ఉండొచ్చు. వారు కొన్ని పెద్ద షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వారు భారత ఆటగాళ్లు. కొన్నిసార్లు ఏవేవో జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం కొంత సమయం తీసుకోని  సరైన షాట్‌ని ఎంచుకోవాలి. ఇక్కడే వారిద్దరూ ఏదో తప్పు చేస్తున్నారు. షాట్లను సరిగ్గా ఎంచుకోవడం లేదు. అందుకే విఫలమవుతున్నారు’ గావస్కర్‌ అన్నారు.

హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయకపోవడం ముంబయి ఇండియన్స్‌తోపాటు రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బ అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ‘హార్దిక్ పాండ్య బౌలింగ్‌ చేయకపోవడం ముంబయి ఇండియన్స్‌కే కాదు..టీమ్‌ఇండియాకూ పెద్ద దెబ్బే. ఎందుకంటే అతడిని జట్టులోకి ఆల్‌రౌండర్‌గా తీసుకున్నారు. 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి బౌలింగ్‌ చేయలేకపోతే అది కెప్టెన్‌గా ఇబ్బందికరంగా మారుతుంది’ అని సునీల్ గావస్కర్ వివరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని