Sunil Gavaskar: భారత్‌ విజయం.. గావస్కర్‌ డ్యాన్స్‌ చూశారా?

ఉప్పల్‌లో భారత జట్టు మ్యాచ్‌ను గెలిచిన అనంతరం భారత మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ ఎనలిస్ట్‌ సునీల్ గావస్కర్ స్టెప్పులేయడం విశేషం.......

Published : 26 Sep 2022 21:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ ఉప్పల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్‌ను పట్టేసిన విషయం తెలిసిందే. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు సాధించాల్సిన సమయంలో క్రీజులో ఉన్న హార్దిక్‌ పాండ్య బౌండరీతో విజయాన్ని అందించాడు. దీంతో అభిమానుల ఆనందోత్సాహాలతో ఉప్పల్‌ స్టేడియం దద్దరిల్లిపోయింది. క్రికెటర్లు కూడా సంబురాలు చేసుకుంటూ కనిపించారు. ఇదిలా ఉంటే.. భారత మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ ఎనలిస్ట్‌ సునీల్ గావస్కర్ సైతం స్టెప్పులేయడం విశేషం. మ్యాచ్ అనంతర కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మాథ్యూ హెడెన్‌తో కలిసి వేదికను పంచుకున్న సన్నీ.. హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని