Asian Games 2022: ఆసియా క్రీడల్లో భారత్‌ శుభారంభం.. క్రికెట్‌ సహా 5 పతకాలు

ఆసియా క్రీడలను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. పతకాల వేట కొనసాగుతోంది.

Updated : 25 Sep 2023 17:26 IST

హాంగ్‌జౌ: ఆసియా క్రీడలను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. తొలిరోజే పతకాల వేట ఆరంభించింది. ఇప్పటివరకూ 4 పతకాలు సాధించగా.. మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. వీటిలో రోయింగ్‌లో మూడు పతకాలు ఉన్నాయి. రోయింగ్‌ పురుషుల కాక్స్‌డ్‌ ఎయిట్‌లో రజత పతకాన్ని దక్కించుకోగా.. పురుషుల కాక్స్‌లెస్‌ పెయిర్‌లో కాంస్య పతకం దక్కింది. రోయింగ్‌ లైట్‌వెయిట్‌ పురుషుల డబుల్‌ స్కల్స్‌లో రజతం సొంతం చేసుకుంది. ఇక షూటింగ్‌లో మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో మెహులి ఘోష్‌, రమిత టీమ్‌ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

మహిళల క్రికెట్‌.. పతకం ఖాయం..

మరోవైపు మహిళల క్రికెట్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ సత్తా చాటింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 51 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పతనంలో పూజా వస్త్రాకర్‌ (4/17) కీలక పాత్ర పోషించింది. లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు కెప్టెన్‌ స్మృతి మంధాన (7), షెఫాలీ వర్మ (17) తడబడినా.. జెమీమా రోడ్రిగ్స్‌ (20*),  కనికా (1*) నాటౌట్‌గా నిలిచి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. సెమీస్‌లో సత్తా చాటడంతో టీమ్‌ఇండియాకూ పతకం ఖాయమైంది. ఫైనల్‌లోనూ గెలిస్తే టీమ్‌ఇండియాకు స్వర్ణమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని