Surya kumar Yadav: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ - 5 సూర్య కుమార్‌ యాదవ్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) మరో రికార్డు నమోదు చేశాడు

Published : 14 Jul 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన సూర్య కుమార్‌ యాదవ్‌ (Surya kumar Yadav) మరో ఘనత సాధించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల జాబితాలో టాప్‌ - 5లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టీ20 తర్వాత 44 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న సూర్య కుమార్‌.. టాప్‌ - 10 బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. బాబర్‌ ఆజామ్‌ (పాకిస్థాన్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌) అయిడెన్‌ మార్‌క్రమ్‌ (దక్షిణాఫ్రికా), డేవిడ్‌ మలన్‌ (ఇంగ్లాండ్‌)లు సూర్య (732) కంటే ముందున్నారు.

వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో జస్ప్రిత్‌ బూమ్రా నాలుగు పాయింట్లు మెరుగుపరుచుకుని టాప్‌ - 1లో నిలిచాడు. అతని తర్వాత ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌), షాహీన్‌ అఫ్రిది (పాకిస్థాన్‌) జాస్‌ హేజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా), ముజీబ్‌ అర్‌ రెహమాన్‌ (అఫ్గానిస్థాన్‌)లు టాప్‌-5లో ఉన్నారు. ఇక జట్ల ర్యాంకింగ్స్‌ చూసుకుంటే టెస్టుల్లో 128 పాయింట్లతో ఆస్ట్రేలియా ముందుండగా, 114 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. వన్డేల్లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, తర్వాత 108 పాయింట్లతో మూడో స్థానంలో టీమిండియా ఉంది. టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ 270 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితా చూస్తే... టెస్టుల్లో రవీంద్ర జడేజా, వన్డేల్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌), టీ20లో మహ్మద్‌ నబీ (అఫ్గానిస్థాన్‌) టాప్‌లో ఉన్నారు.

టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్

* జోరూట్‌ (ఇంగ్లాండ్‌) - 923

* లబుషేన్‌ (ఆస్ట్రేలియా) - 885

* స్టీవ్‌స్మిత్‌ (ఆస్ట్రేలియా) - 848

* బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్‌) - 815

* రిషబ్‌ పంత్‌ (భారత్‌) - 801

వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్

* బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్‌) - 892

* ఇమామ్‌ ఉల్‌ హక్‌ (పాకిస్థాన్‌) - 815

* విరాట్‌ కోహ్లీ (భారత్‌) - 803

* రోహిత్‌ శర్మ (భారత్‌) - 802

* క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాఫ్రికా) - 789

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని