WTC Final: టెస్టుకు అవసరమైన సహనం కోహ్లీసేనలో లేదు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైనంత సహనం ప్రదర్శించలేదని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. ఆరో రోజు వాతావరణం చాలా బాగుందని పేర్కొన్నారు. ఓపికతో పాటు షాట్ల ఎంపిక బాగుంటే ఫలితం మరోలా ఉండేదని వెల్లడించారు....

Published : 02 Jul 2021 01:16 IST

ఓపిక, షాట్ల ఎంపిక ఎలా ఉండాలో కేన్‌ చూపించాడు: సన్నీ

ముంబయి: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైనంత సహనం ప్రదర్శించలేదని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. ఆరో రోజు వాతావరణం చాలా బాగుందని పేర్కొన్నారు. ఓపికతో పాటు షాట్ల ఎంపిక బాగుంటే ఫలితం మరోలా ఉండేదని వెల్లడించారు.

టీమ్‌ఇండియా తెలుపు బంతి క్రికెట్‌కు ఎక్కువగా అలవాటు పడిందని సన్నీ విమర్శించారు. కొన్ని చెత్త షాట్లను ఆడి ఓటమికి బాధ్యులు అయ్యారని పేర్కొన్నారు. ‘బౌలర్లకు అనుకూలించే పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ ఆలోచనా విధానం ఎలా ఉండాలో? షాట్ల ఎంపిక ఎలా ఉండాలో? కేన్‌ విలియమ్సన్‌ చూపించాడు’ అని అతడిని ప్రశంసించారు.

‘ఆఖరి రోజు పరిస్థితులు చాలా బాగున్నాయి. సూర్యుడు పగటి పూటంతా ఉన్నాడు. కానీ భారతీయులు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎక్కువగా అలవాటు పడ్డారు. టెస్టు క్రికెట్‌కు అవసరమైనంత ఓపిక ప్రదర్శించలేదు. ఆడకూడని షాట్లతో తమ ఓటమికి తామే బాధ్యులయ్యారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైన సహనం, షాట్ల ఎంపికను న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ రెండు ఇన్నింగ్సుల్లో చూపించాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ను నియంత్రించి జట్టుకు విజయం అందించాడు’ అని సన్నీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని