మధుమేహం ఉంటేనే అవగాహన కల్పించాలా?

క్రికెట్‌ స్థిత ప్రజ్ఞుడు అనిల్‌ కుంబ్లే ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. ఏదైనా వార్త కథనం ప్రచురించే ముందు సరిచూసుకోవాలని హితవు పలికారు. ఏదైనా వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఆ వ్యాధిగ్రస్థుడే అవ్వాల్సిన పన్లేదని విమర్శించారు...

Updated : 17 Jul 2021 15:24 IST

వాస్తవాలు తెలుసుకొని రాయాలని చురకలు

క్రికెట్‌ స్థిత ప్రజ్ఞుడు అనిల్‌ కుంబ్లే ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. ఏదైనా వార్త కథనం ప్రచురించే ముందు సరిచూసుకోవాలని హితవు పలికారు. ఏదైనా వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఆ వ్యాధిగ్రస్థుడే అవ్వాల్సిన పన్లేదని విమర్శించారు.

ఔట్‌లుక్‌ మ్యాగజైన్‌ మధుమేహం గురించి ఓ కథనం రాసింది. భారత దేశానికి డయాబెటిస్‌ ఎంత భారంగా మారిందో అందులో వివరించింది. జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే సమస్య సమసిపోతుందని వెల్లడించింది. మధుమేహంతో జీవిస్తున్న ప్రముఖులు వీరేనంటూ కొందరి చిత్రాలను ప్రచురించింది.

గౌరవ్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌, కమల్‌ హాసన్‌, సుధా చంద్రన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, వసీమ్‌ అక్రమ్‌, నిక్‌ జోనాస్‌, అనిల్‌ కుంబ్లే వంటి ప్రముఖులకు డయాబెటిస్‌ ఉందని ఔట్‌లుక్‌ ప్రచురించింది. దీనిపై అనిల్‌ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ఏదైనా ముద్రించే ముందు దయచేసి సరిచూసుకోండి. మధుమేహంపై అవగాహన కల్పించేందుకు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని చెప్పే వ్యక్తికి డయాబెటిస్‌ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా మధుమేహంతో బాధపడుతుంటే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, నిరంతరం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది’ అని కుంబ్లే ట్వీట్‌ చేశారు. మధుమేహం గురించి ఆయన అనేక కార్యక్రమాల్లో అవగాహన కల్పిస్తుంటారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని