Tokyo Olympics: మహిళల హాకీ.. పరాజయాల పరంపర

ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల ఓటముల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచులో 4-1 తేడాతో ఓటమి చవిచూశారు. అందివచ్చిన అవకాశాలను టీమ్‌ఇండియా చేజేతులా జారవిడిచింది...

Published : 28 Jul 2021 11:09 IST

క్వార్టర్స్‌ చేరాలంటే ఇకపై అన్నీ గెలవాలి

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల ఓటముల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచులో 4-1 తేడాతో ఓటమి చవిచూశారు. అందివచ్చిన అవకాశాలను టీమ్‌ఇండియా చేజేతులా జారవిడిచింది. ఇక భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే తర్వాత తలపడే ప్రతి మ్యాచులోనూ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి. బ్రిటన్‌లో హన్నా మార్టిన్‌ (2ని, 19ని), లిలీ (41ని), గ్రేస్‌ బాల్స్‌డన్‌ (57 ని) గోల్స్‌ చేశారు. భారత్‌ నుంచి షర్మిలా దేవి (23 ని) ఒక్కరే గోల్‌ చేయడం గమనార్హం.

ఆట మొదలైన రెండో నిమిషంలోనే బ్రిటన్‌ను మార్టిన్‌ ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఇక రెండో క్వార్టర్‌లోనూ బ్రిటన్‌దే ఆధిపత్యం. హన్నా మరో గోల్‌ చేసింది. అయితే, 23వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను షర్మిల సద్వినియోగం చేసింది. బంతిని నెట్‌లోకి పంపించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. కానీ మరికాసేపటికే లిలీగోల్‌ చేసి మూడో క్వార్టర్‌ను 3-1తో ముగించింది. నాలుగో క్వార్టర్‌లో భారత్‌ శ్రమించినా.. అవకాశాలు చేజారాయి. మరో మూడు నిమిషాల్లో  ఆట ముగుస్తుందనగా బాల్స్‌డన్‌ గోల్‌ కొట్టి బ్రిటన్‌కు 4-1 తేడాతో తిరుగులేని విజయం అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని