Cricket News: డీఆర్‌ఎస్‌ లేకుండానే పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు

ఆధునిక క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఆటగాడు ఔటైనా, అంపైర్‌ ఇచ్చిన నిర్ణయంపై అభ్యంతరాలున్నా వాళ్లు తరచూ డీఆర్‌ఎస్‌కు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే...

Published : 11 Sep 2021 02:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆధునిక క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంపైర్‌ ఇచ్చిన నిర్ణయంపై అభ్యంతరాలుంటే.. తరచూ డీఆర్‌ఎస్‌కు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే. అక్కడ సాంకేతిక అంశాల ఆధారంగా కచ్చితమైన సమాచారం మేరకు ఆయా బ్యాట్స్‌మెన్‌ ఔటో, నాటౌటో తేలుస్తారు. అందులో అంపైర్‌ డెసిషన్‌ అనేది మరో కీలకాంశం. అయితే, ఐసీసీ సభ్య దేశాలన్నీ తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఈ డీఆర్‌ఎస్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఐసీసీ ఆమోదించిన డీఆర్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతోనే ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.

మరికొద్ది రోజుల్లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆ సదుపాయం కల్పించుకోలేకపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ బోర్డు ప్రతినిధులే మీడియాకు చెప్పారు. సెప్టెంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లకు డీఆర్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఒకరు వివరణ ఇవ్వగా.. మరో అధికారి మాట్లాడుతూ ఈ సిరీస్‌లకు సంబంధించి పీసీబీ మీడియా ప్రసార హక్కులను ఆలస్యంగా విక్రయించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. అయితే, వచ్చెనెల లాహోర్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 మ్యాచ్‌లకు మాత్రం డీఆర్‌ఎస్‌ విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని