
Sourav Ganguly: నిలకడగా గంగూలీ ఆరోగ్యం.. బులిటెన్ విడుదల
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోల్‌కతాలోని వుడ్‌లాండ్ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొంది. ఎలాంటి జ్వరం లేదని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాత్రంతా నిద్రపోయారని, భోజనం కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిపుణులైన వైద్యులు గంగూలీని పర్యవేక్షిస్తున్నారని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన సోమవారం వుడ్‌లాండ్ ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటికే ఆయన రెండు సార్లు కొవిడ్-19 టీకా తీసుకున్నాడు. 49 ఏళ్ల గంగూలీకి ఈ ఏడాది యాంజియోప్లాస్టీ జరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.