SRH - IPL : సన్‌రైజర్స్‌కు కొత్త కోచింగ్ స్టాఫ్‌.. హెడ్‌ కోచ్‌గా టామ్‌ మూడీ

 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ కొత్త కోచింగ్‌ స్టాఫ్‌ను...

Published : 23 Dec 2021 17:51 IST

ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ కొత్త కోచింగ్‌ స్టాఫ్‌ను ప్రకటించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా విండీస్‌ మాజీ స్టార్‌ ప్లేయర్‌ బ్రియాన్‌ లారా, దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. అదేవిధంగా ఇప్పటి వరకు బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా కొనసాగించింది. గత సీజన్‌ వరకు హెడ్ కోచ్‌గా పనిచేసిన ట్రావిస్ బైలిస్‌ స్థానంలో టామ్‌ మూడీని ప్రధాన కోచ్‌గా నియమిస్తూ ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణయం తీసుకుంది. టామ్‌ మూడీ ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌హెచ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సైమన్‌ కటిచ్‌ను టామ్‌ మూడీకి డిప్యూటీగా నియమించింది. ఫీల్డింగ్‌ కోచ్‌, స్కౌట్‌గా హేమంగ్‌ బదానీని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఎస్‌ఆర్‌హెచ్‌ ట్వీట్‌ చేసింది. 

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో ఎస్‌ఆర్‌హెచ్‌ టోర్నీని ముగించింది.  ఈసారి రిటెయిన్‌ పద్ధతిలో కేన్‌ విలియమ్సన్, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ను మాత్రమే సన్‌రైజర్స్‌ అట్టిపెట్టుకుంది. డేవిడ్‌ వార్నర్, రషీద్‌ ఖాన్‌ వంటి అగ్రశ్రేణి ప్లేయర్లను వదిలేసింది. వచ్చే ఏడాది మెగా వేలం ఉన్న నేపథ్యంలో కొత్త జట్టుతో బరిలోకి దిగి విజయం సాధించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మెగా ఆక్షన్‌లో ఎవరిని కొనుగోలు చేస్తుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని