IPL 2021: ఐపీఎల్‌ రెండోదశ ఆడటం కష్టమే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండోదశలో బహుశా ఆడకపోవచ్చని ఇంగ్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్‌ అంటున్నాడు. సాధారణంగా ఐపీఎల్‌ ఆడేందుకు ఎలాంటి అవాంతరాలు ఉండవని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ ముందు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ పర్యటనలు ఉన్నాయని వెల్లడించాడు. ...

Published : 23 Jun 2021 01:22 IST

ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌

లండన్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండోదశలో బహుశా ఆడకపోవచ్చని ఇంగ్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు జోస్‌ బట్లర్‌ అంటున్నాడు. సాధారణంగా ఐపీఎల్‌ ఆడేందుకు ఎలాంటి అవాంతరాలు ఉండవని తెలిపాడు. అయితే టీ20 ప్రపంచకప్‌ ముందు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ పర్యటనలు ఉన్నాయని వెల్లడించాడు. కొవిడ్‌-19తో వాయిదాపడ్డ ఐపీఎల్‌ సెప్టెంబర్‌-అక్టోబర్లో యూఏఈ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  

‘సాధారణంగా ఐపీఎల్‌ సమయంలో మరే అంతర్జాతీయ సిరీసులు ఉండవు. అందుకే లీగ్‌ సులభంగా పూర్తవుతుంది. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్‌ ఉన్నప్పుడు జరిగితే మాత్రం ఇంగ్లాండ్‌దే తుది నిర్ణయం’ అని బట్లర్‌ అన్నాడు. కొవిడ్‌-19 పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ రొటేషన్‌ విధానాన్ని అతడు ప్రశ్నించాడు. షెడ్యూల్‌ను పక్కాగా రూపొందిస్తే అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లు మ్యాచులు మిస్సవ్వరని తెలిపాడు.

‘పాలకులకు ఇది మంచి ప్రశ్న! ఎందుకంటే మేం విపరీతంగా క్రికెట్‌ ఆడుతున్నాం. మా కెరీర్లు చిన్నవని మాకు తెలుసు. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా ఆడాలనే అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అలా కుదరకపోవచ్చు. ఇప్పుడు కొవిడ్‌.. పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసింది. ఇలాంటప్పుడే కదా ఆటగాళ్లను సంరక్షించాల్సింది. సానుకూలంగా ఆలోచించేవారినే కదా ప్రశంసించాల్సింది. ప్రణాళికలు సరిగ్గా ఉంటేనే ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. లేదంటే సమతూకం కష్టం’ అని బట్లర్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని