Virat kohli: ఆ బంతిని వదిలేసి జట్టును గెలిపించాడు: అశ్విన్‌పై కోహ్లీ ప్రశంసలు

గెలుపు దాదాపు ఖరారైన సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా అశ్విన్‌ గొప్పగా ఆడాడని విరాట్‌ కోహ్లీ ప్రశంసించాడు.

Published : 25 Oct 2022 02:43 IST

దిల్లీ: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ విన్నింగ్‌ షాట్‌పై విరాట్‌ కోహ్లీ స్పందించాడు. తీవ్రమైన ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఆడి జట్టును విజయంవైపు నడిపించిన తీరును కొనియాడాడు. గెలుపు దాదాపు ఖరారైన సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా నిలకడగా ఆడటమే కాకుండా తెలివైన నిర్ణయాన్ని అమలు చేశాడని అన్నాడు. 

‘‘15-16 పరుగుల లక్ష్యం ఒక్కసారిగా 2 బంతుల్లో 2 పరుగులకు తగ్గిపోతే ఏ ఆటగాడైనా ఊపిరి పీల్చుకుంటాడు. దాదాపు గెలిచేశాం అనుకుని  అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. దినేశ్‌ కార్తీక్‌ ఔట్‌ అయిన తర్వాత నేను అశ్విన్‌కు కవర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఆడాలని చెప్పాను. కానీ అతడు మాత్రం రెండింతలు బుర్రకు పదును పెట్టాడు. వైడ్‌ అవుతుందని ముందే గమనించిన అశ్విన్‌.. షాట్‌ను ప్రయత్నించలేదు.  బంతిని వదిలేసి లైన్‌ లోపలికి జరిగాడు. దీంతో గెలవడం మా వంతైంది. నిజంగా అది చాలా తెలివైన పని’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. భారీ ఉత్కంఠ రేపిన చివరి ఓవర్లో నవాజ్‌ వేసిన బంతిని వదిలేసిన అశ్విన్‌ స్కోర్‌ను సమం చేసిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని