Dhoni - Kohli : ధోనీ సిరల్లో మంచు ప్రవహిస్తూ ఉంటుంది.. విరాట్ ఓ ‘సూపర్‌ హ్యూమన్’

టీమ్‌ఇండియా దిగ్గజ సారథులు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ నాయకత్వ శైలిపరంగా..

Published : 23 Feb 2022 15:15 IST

దిగ్గజాల నాయకత్వ శైలిని అభివర్ణించిన షేన్‌ వాట్సన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజ సారథులు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ నాయకత్వ శైలిపరంగా విభిన్న ధ్రువాలు... అటువంటి వారిద్దరి వ్యవహార శైలిని ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అద్భుతంగా అభివర్ణించాడు. విరాట్ కోహ్లీని ‘సూపర్‌ హ్యుమన్‌’గా వాట్సన్‌ పేర్కొన్నాడు. ‘‘నాయకుడిగా విరాట్ కోహ్లీ అద్భుతాలు చేశాడు. ఆటగాళ్లను ఉత్సాహపరచడంలో ఎప్పుడూ ముందుంటాడు. భారీ అంచనాలు అతడిపై ఉన్న ప్రతిసారీ అందుకున్నాడు. నా వరకైతే విరాట్ కోహ్లీ సూపర్ హ్యూమన్. మైదానంలో ఎలా ఉండాలి.. వెలుపల ఎలా ఉండాలనేది చాలా బాగా తెలుసు. ఆర్‌సీబీ జట్టు తరఫున కోహ్లీతో పని చేయడం గొప్ప అనుభవం’’ అని వివరించాడు. 

ఇక ధోనీ విషయానికొస్తే.. ‘‘ ఎంఎస్‌ ధోనీ సిరల్లో (Veins) మంచు పరుగెత్తుతూ ఉంటుందేమో. అందుకే అంతా మిస్టర్‌ కూల్‌ అంటారు. ఒత్తిడిని అధిగమించగల సామర్థ్యం అతడి సొంతం. జట్టులోని ఆటగాళ్లందరిపై విశ్వాసం కలిగి ఉంటాడు. అంతేకాకుండా వారికి తమ శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉండేలా చూసుకుంటాడు. అంతేకాకుండా తన చుట్టూ ఉండే వ్యక్తులకు ఏమి కావాలో, వారిలో ఏ టాలెంట్ ఉందో పూర్తిగా తెలుసుకుంటాడు. ప్లేయర్లు మైదానంలో అవసరమైందే చేస్తారని నమ్ముతాడు’’ అని షేన్‌ వాట్సన్‌ తెలిపాడు. ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే తరఫున వాట్సన్‌ ఆడాడు. అలానే కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సీబీ జట్టుకు వాట్సన్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సహాయక కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని