T20 World Cup : ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడెవరో సెహ్వాగ్‌ చెప్పేశాడు..

ఈ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడెవరో సెహ్వాగ్‌ అంచనా వేశాడు. అయితే.. ఆ ఆటగాడు భారత్‌ నుంచి కాకపోవడం గమనార్హం.

Published : 21 Oct 2022 12:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు క్రికెట్‌ మజాను అందించే సూపర్‌ 12 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ పోరు ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజే చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాక్‌ మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ ఉండనుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రోహిత్‌ శర్మ, బాబర్‌ ఆజామ్‌ నేతృత్వంలోని జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడెవరో అంచనా వేశాడు. అయితే.. అతడు భారత ఆటగాడు కాకపోవడం గమనార్హం. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఈ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు.

‘బాబర్‌ ఆజామ్‌ బ్యాటింగ్‌ బ్రిలియంట్‌గా ఉంటుంది. అతడి ఆటను చూడటం చాలా గొప్పగా అనిపిస్తుంది. కోహ్లీ బ్యాటింగ్‌ను తలపిస్తుంది. అతడి ఆట తీరును మీరు ఆస్వాదిస్తారు’ అని ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్‌ కొనియాడాడు.

ఇక సెహ్వాగ్ అంచనాలు నిజమవుతాయని.. ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ గుర్తుచేసుకున్నాడు. టెస్టుల్లో తన సామర్థ్యాన్ని గుర్తించింది అతడే అని పేర్కొన్నాడు. తాను మంచి టెస్టు ప్లేయర్‌ కాగలనని సెహ్వాగ్‌ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని