VVS Laxman: ఆసియా కప్‌.. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్‌ ఎంపిక

ఆసియా కప్‌ (Asia Cup) టోర్నీ సమీపిస్తున్న వేళ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) కరోనా బారిన పడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌(VVS Laxman)ను..........

Published : 24 Aug 2022 20:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆసియా కప్‌ (Asia Cup) టోర్నీ సమీపిస్తున్న వేళ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) కరోనా బారిన పడటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌(VVS Laxman)ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆసియా కప్‌ టోర్నీ వరకు ఆయన కోచ్‌గా ఉంటారని పేర్కొంది. ద్రవిడ్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, కొవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన తర్వాత ఆయన భారత బృందంలో చేరతారని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం లక్ష్మణ్‌ జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించారు. కాగా ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది.

యూఏఈ వేదికగా ఈ నెల 27వ తేదీ నుంచి ఆసియా కప్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల భారత్ జట్టును ఆసియా కప్‌ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్య వంటి సీనియర్లకు అవకాశం కల్పించింది. అయితే గాయం కారణంగా కీలక పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్, షమీ మెగా టోర్నీకి దూరమయ్యారు. స్టాండ్‌బై ఆటగాళ్లుగా అక్షర్‌ పటేల్, దీపక్‌ చాహర్, శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని