Warner - Afridi: నవ్వులు తెప్పిస్తున్న డేవిడ్‌ వార్నర్‌, షాహీన్‌ అఫ్రిదీల వీడియో

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌, పాకిస్థాన్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. లాహోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో చివరి బంతికి ఈ సరదా...

Updated : 24 Mar 2022 09:04 IST

(Photo: Ion Shop Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌, పాకిస్థాన్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిదీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. లాహోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో చివరి బంతికి సరదా సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది, దీంతో మూడో రోజు ఆట నిలిచిపోయే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 11/0గా నమోదైంది. ఓపెనర్లు ఖవాజా (7), వార్నర్‌(4) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 134 పరుగులకు చేరింది.

ఈ క్రమంలోనే అఫ్రిది వేసిన చివరి బంతిని వార్నర్‌ డిఫెన్స్‌ చేశాడు. బంతి అక్కడే పడటంతో అతడు పరుగు తీసేలా కనిపించి మళ్లీ వెనక్కి తగ్గాడు. అదే సమయంలో పాక్‌ పేసర్‌ వార్నర్‌ మీదకు దూసుకొచ్చి ముఖంపై ముఖం పెట్టి చూశాడు. దానికి వార్నర్‌ సైతం తగ్గేదేలే అనేలా చూశాడు. అయితే, క్షణాల్లోనే ఆ ఇద్దరూ నవ్వుకుంటూ వెనక్కి వెళ్లారు. దీంతో అది చూసిన వారంతా తొలుత ఏమైందో అర్థంకాక తికమకపడ్డారు. కానీ, తర్వాత ఆ విషయాన్ని అర్థంచేసుకున్న తోటి ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. ఇక్కడ అఫ్రిది.. వార్నర్‌ కన్నా చాలా ఎక్కువ ఎత్తు ఉండడంతో నెటిజన్లు ఈ విషయంపై సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఈ వీడియోను అభిమానులతో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని