Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించిన వారిలో యశస్వి జైస్వాల్‌ ఒకడు. తన భీకర ఫామ్‌తో బౌలర్లను చితక్కొట్టిన ఈ కుర్రాడు మైదానంలో ఎలా ఆలోచిస్తాడో అతడి మాటల్లోనే తెలుసుకుందాం..!

Published : 30 May 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఐపీఎల్‌ (IPL 2023) సీజన్లో తన భీకర ఫామ్‌తో రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అందరి దృష్టినీ ఆకర్షించాడు. అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. మొత్తం 14 మ్యాచుల్లో 635 పరుగులు సాధించాడు. అందులో ఓ శతకం కూడా ఉంది. కోల్‌కతాపై 47 బంతుల్లో 98 పరుగుల వీర విధ్వంసంతో మరుపురాని ఇన్నింగ్స్‌ను ఆడాడు. తాజాగా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ స్టార్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న అతను తన ఆటతీరుతో పాటు తన మనుసులోని ఆలోచనలను పంచుకున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే..

  • దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నిరంతరం దాని కోసమే కృషి చేస్తున్నాను. మైదానంలో ఉన్నంతసేపు ఆటను గమనిస్తూ ఉంటా. ఎలాంటి ఒత్తిడి లేకుండా షాట్లు కొట్టాలని ప్రయత్నిస్తుంటా. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని చూస్తాను. క్రికెట్‌ ఒక ఆట అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆటను ప్రేమించాలి. నేను అదే చేస్తాను.
  • నేనేం చేయగలను? ఎక్కడి వరకు వెళ్లగలనని గతంలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడూ ప్రస్తుతంపైనే దృష్టి పెడతాను. నా ఫోకస్‌ మొత్తం నేనిప్పుడు ఏం చేయగలననే దానిపైనే ఉంటుంది. నా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా.
  • సమయం గడుస్తున్న కొద్దీ నా ఆటతీరు, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆడుతున్న కొద్దీ ఆటపై పట్టు సాధించాను. ఒక్కొక్కరి బౌలింగ్‌లో ఒక్కోలాగా ఆడాల్సి ఉంటుంది. నా వరకు నేనెప్పుడూ దూకుడుగా ఆడాలనే చూస్తాను. నా ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. స్ట్రైక్‌ రేట్‌ ఎప్పుడూ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను.
  • బౌలింగ్‌ వేయడాన్ని కూడా చాలా ఎంజాయ్‌ చేస్తా. బౌలింగ్‌ విషయంలో నేను ఇప్పుడు చాలా సాధన చేస్తున్నాను. బౌలింగ్‌ వేయాలని.. లెగ్‌ స్పిన్‌ను ఎంజాయ్‌ చేయాలని వేచిచూస్తున్నాను. నేనెప్పుడు నాలో ఏదైనా లోపం ఉందా? అని ఆలోచించను. నేనింకా నేర్చుకోవాల్సింది ఏముంది? అనే అంశంపైనే దృష్టి పెడతాను.
  • లాంగ్‌ డ్రైవ్‌లంటే నాకు చాలా ఇష్టం. ఐపీఎల్‌ లాంటి సుదీర్ఘ టోర్నమెంట్‌లు ఆడుతున్న సమయంలో మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకోవడం చాలా అవసరం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని