IPL PlayOffs : ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే.. పరిస్థితి ఏంటి?

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సమరానికి రంగం సిద్ధమైంది. అయితే.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లు రద్దు అయితే పరిస్థితి ఏంటి..? నిబంధనలు ఎలా ఉన్నాయి..? 

Updated : 23 May 2023 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఈ ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌లో తొలి క్వాలిఫయర్‌(Qualifier 1) మ్యాచ్‌ నేడే. చెన్నై చెపాక్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌(GT vs CSK) కోసం.. దిగ్గజ జట్లైన గుజరాత్‌(Gujarat Titans), చెన్నై(Chennai Super Kings) సిద్ధమయ్యాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.

అయితే.. ప్లేఆఫ్స్‌(IPL PlayOffs)లోని మ్యాచ్‌లు వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే పరిస్థితి ఎంటి? సగటు క్రీడాభిమానికి కలిగే ప్రశ్న ఇది. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయి. నేడు చెన్నైలో జరిగే మ్యాచ్‌కు పెద్దగా వర్షం ముప్పు అయితే లేదు. ‘ఆక్యూవెదర్‌’ రిపోర్టు ప్రకారం.. కేవలం 2 శాతం మాత్రమే వర్షం పడేందుకు అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కారణంగా ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆగిపోతే..

  • క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా ఆగిపోతే.. విజేతను సూపర్‌ ఓవర్‌ ద్వారా నిర్ణయిస్తారు.
  • ఒకవేళ సూపర్‌ ఓవర్‌కూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. లీగ్‌ స్టేజ్‌లో ఆయా జట్ల స్థానాలను బట్టి మ్యాచ్‌ ఫలితాన్ని తేలుస్తారు. ఈ నిబంధన క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వీటికి రిజర్వ్‌ డే లేదు.
  • ఈ నిబంధనలు బట్టి చూస్తే.. వర్షం కారణంగా క్వాలిఫయర్‌ 1 రద్దు అయితే.. అప్పుడు గుజరాత్‌ జట్టుకే ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అత్యధిక విజయాలతో టాప్‌ 1లో ఆ జట్టు లీగ్‌ దశను ముగించింది.
  • ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ముంబయి కంటే మెరుగైన స్థానంలో ఉన్న లఖ్‌నవూకే ముందుకెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి.
  • ఇక ఐపీఎల్‌ ఫైనల్‌కు రిజర్వ్‌డే ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని