IPL 2023: ఐపీఎల్లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్..?
దాదాపు రెండున్నర నెలలపాటు అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్ సిద్ధమైంది. ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. అందులో కీలకమైన నిబంధన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. అసలేంటి ఈ నిబంధన.. దీని వల్ల ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభం కానుంది. గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ నిర్వాహకులు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత సీజన్‌ను అభిమానులకు మరింత రసవత్తరంగా మార్చేందుకు బీసీసీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ఒకటి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్. ఇంతకీ ఈ నిబంధన ఏంటని అందరిలోనూ మెదిలే అనుమానం. మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది ఒకటే చర్చ. ఇది ఐపీఎల్‌కు కొత్తేమో కానీ.. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లోనే అమలు అవుతోంది. అయితే, దీనివల్ల ఆల్‌రౌండర్ల ప్రభావం తగ్గుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. అలాటిదేం ఉండదని కొందరు కొట్టిపడేశారు.
ఇదీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్..
* ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు 11 మంది ఆటగాళ్లతోపాటు నలుగురు సబ్స్టిట్యూట్లను ప్రకటించాలి. ఆ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించేందుకు అవకాశం ఉంటుంది.
* తుది జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా భారత క్రికెటర్‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
* మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆడించుకోవచ్చు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించొచ్చు.
* ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు.
* ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదా ఓవర్ ముగిశాక లేదా వికెట్ పడ్డాక లేదా ఓ బ్యాటర్ రిటైరయ్యాకే ఇంపాక్ట్ ఆటగాడు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ స్థానంలో వచ్చే ఇంపాక్ట్ ఆటగాడు తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది.
* ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు కెప్టెన్‌గా మాత్రం బాధ్యతలు నిర్వర్తించకూడదు. 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు