FIFA World Cup 2022: ప్రపంచ సంగ్రామం సిద్ధం.. ఎప్పుడు, ఎలా చూడాలంటే..?

టీ20 ప్రపంచకప్‌ జ్ఞాపకాలను మరువకముందే క్రీడాభిమానుల కోసం మరో మెగా టోర్నీ సిద్ధమైంది. ఖతార్‌ వేదికగా ఆదివారం నుంచి ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2022 మొదలు కానుంది. తొలి మ్యాచ్‌ ఆతిథ్య దేశంతో ఈక్వెడార్‌ తలపడనుంది.

Published : 19 Nov 2022 20:49 IST

ఇంటర్నెట్ డెస్క్: మొన్నటి వరకు టీ20 ప్రపంచకప్‌ పోటీలను ఆస్వాదించిన క్రీడాభిమానుల కోసం ఆదివారం నుంచి మరో భారీ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. దాదాపు 32 దేశాల జట్లు పాల్గొనే ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2022 ఫస్ట్‌ ఎడిషన్‌కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఫుట్‌బాల్‌ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఖతార్‌లో వాలిపోయారు. తొలి మ్యాచ్‌ ఆతిథ్య ఖతార్‌, ఈక్వెడార్ జట్ల మధ్య రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. 

* నవంబర్ 20 నుంచి డిసెంబర్‌ 18వ తేదీ వరకు ఎనిమిది స్టేడియాల్లో 64 మ్యాచ్‌లు జరుగుతాయి. 

* మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. 

* భారత్‌లో ఈ మ్యాచ్‌లను స్పోర్ట్స్‌ 18, స్పోర్ట్స్ 18 హెచ్‌డీ ఛానెళ్లలో చూసేందుకు అవకాశం ఉంది. 

* భారత కాలమానం కొన్ని మ్యాచులు అర్ధరాత్రి 12.30 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, రాత్రి 9.30 గంటలకు జరుగుతాయి.

* సెమీఫైనల్స్‌, కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌, ఫైనల్‌ అన్నీ అర్ధరాత్రి 12.30 గంటలకు జరుగుతాయి. 

గ్రూప్‌ల్లోని దేశాలు

గ్రూప్‌ - A: ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్

గ్రూప్‌ - B: ఇంగ్లాండ్‌, ఇరాన్, యూఎస్, వేల్స్

గ్రూప్‌ - C: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పొలాండ్

గ్రూప్‌ - D: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, టునీషియా

గ్రూప్‌ - E: స్పెయిన్, కోస్తారికా, జర్మనీ, జపాన్ 

గ్రూప్‌ - F: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా

గ్రూప్‌ - G: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్

గ్రూప్‌ - H: పోర్చగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని