మూడో టెస్టు: ఆస్ట్రేలియా రెండో వికెట్‌

టీమ్‌ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. అరంగేట్రం మ్యాచ్‌‌లోనే అర్ధశతకం బాదిన యువ బ్యాట్స్‌మన్‌ విల్‌ పకోస్కీ(62*; 110 బంతుల్లో 4x4)...

Updated : 07 Jan 2021 12:05 IST

సిడ్నీ: టీమ్‌ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. అరంగేట్రం మ్యాచ్‌‌లోనే అర్ధశతకం బాదిన యువ బ్యాట్స్‌మన్‌ విల్‌ పకోస్కీ(62*; 110 బంతుల్లో 4x4).. నవ్‌దీప్‌ సైని బౌలింగ్‌లో ఔటయ్యాడు. 34.1 ఓవర్‌లో జట్టు స్కోర్‌ 106 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. అంతకుముందు డేవిడ్‌ వార్నర్‌(5) జట్టు స్కోర్‌ 6 పరుగుల వద్దే ఔటైనా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (38; 87 బంతుల్లో 5x4)తో కలిసి పకోస్కీ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం లబుషేన్‌, స్మిత్‌ క్రీజులో ఉన్నారు. 35 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 108/2గా నమోదైంది. ఇక తొలి సెషన్‌లో వర్షం అంతరాయం కారణంగా సుమారు నాలుగు గంటల పాటు ఆటకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్‌ తొలి సెషన్‌లో 21/1 పరుగులే చేసింది.

ఇవీ చదవండి..

జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్‌ కంటతడి..

ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్ఛార్జ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని