IND w Vs IRE w: ఐర్లాండ్‌తో కీలకపోరు.. టాస్‌ గెలిచిన భారత్‌

మహిళల టీ20 ప్రపంచకప్ (‌Womens T20 World Cup) లో భాగంగా గ్రూప్‌ బిలో భారత్‌, ఐర్లాండ్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

Updated : 20 Feb 2023 18:11 IST

గాబెరా: మహిళల టీ20 ప్రపంచకప్ (‌Womens T20 World Cup) లో భాగంగా గ్రూప్‌ బిలో భారత్‌, ఐర్లాండ్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ని ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ హర్మన్‌ప్రీత్‌ సేనకు చాలా కీలకం. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. పాక్, వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా పరాజయం తప్పలేదు. దీంతో ఒక్కసారిగా భారత అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారిపోయాయి. ఐర్లాండ్‌పై గెలిస్తే భారత్ ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరుతుంది. అలా జరగని పక్షంలో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రూప్‌ - A నుంచి ఆసీస్‌, గ్రూప్‌ - B నుంచి ఇంగ్లాండ్‌ ఇప్పటికే సెమీస్‌ బెర్తులను ఖరారు చేసుకున్నాయి.

భారత్‌ తుది జట్టు:

స్మృతి మంధాన,  షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్‌), దేవికా వైద్య, దీప్తి శర్మ,  పూజా వస్త్రాకర్, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్,
రేణుకా సింగ్. 

ఐర్లాండ్ తుది జట్టు:   

అమీ హంటర్, గాబీ లూయిస్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐమర్ రిచర్డ్‌సన్, లూయిస్ లిటిల్, లారా డెలానీ(కెప్టెన్‌), అర్లీన్ కెల్లీ, మేరీ వాల్డ్రాన్(వికెట్ కీపర్‌), లేహ్ పాల్, కారా ముర్రే, జార్జినా డెంప్సే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని