PAK vs AFG: రాణించిన బాబర్ అజామ్, షఫీక్‌.. చివర్లో ఇఫ్తికార్ మెరుపులు

ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

Published : 23 Oct 2023 17:52 IST

చెన్నై: ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ పాక్‌కు చాలా కీలకం. సెమీస్ అవకాశాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు తప్పక గెలవాలి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ (74; 92 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ (58; 75 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.  సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8)   తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. చివర్లో షాదాబ్‌ ఖాన్‌ (40; 38 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌ నిలకడగా ఆడగా.. ఇఫ్తికార్ అహ్మద్‌ (40; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.  అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

ఇమామ్‌ను నవీనుల్‌ హక్‌ పెవిలియన్‌కు పంపగా.. షఫీక్‌, మహ్మద్ రిజ్వాన్ (8)లను నూర్ అహ్మద్ తన వరస ఓవర్లలో పెవిలియన్‌కు పంపి పాక్‌ను దెబ్బకొట్టాడు.  ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షకీల్‌తో కలిసి బాబర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఈ జోడీని నబీ విడదీశాడు. షకీల్.. నబీ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌కు చిక్కాడు. కొద్దిసేపటికి బాబర్‌ను అజామ్‌ను నూర్ అహ్మద్‌ వెనక్కి పంపాడు. చివర్లో షాదాబ్‌ఖాన్‌ సహకారంతో ఇఫ్తికార్ అహ్మద్ దూకుడుగా ఆడటంతో పాక్ మంచి స్కోరు సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని