మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌కు మూడేళ్ల జైలు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)కి ఏసీబీ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మలక్‌పేట్‌ ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వర్తించిన మహేందర్‌సింగ్‌పై 2003లో కేసు నమోదైంది.

Updated : 30 Nov 2021 06:00 IST

ఆదాయానికి మించి ఆస్తుల కేసు.. 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)కి ఏసీబీ న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మలక్‌పేట్‌ ఆర్టీవో కార్యాలయంలో విధులు నిర్వర్తించిన మహేందర్‌సింగ్‌పై 2003లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడి వద్ద ఆదాయానికి మించి రూ.30,00,719 ఉన్నట్లు కోర్టు ధ్రువీకరించింది. జరిమానా కట్టని పక్షంలో మరో రెండు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు