స్వచ్ఛతకు కొత్త మార్గం

మురుగు కాలువల్లో పేరుకుపోయే చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం స్థానిక సంస్థల సిబ్బందికి కష్టంతో కూడుకున్న పని. దీనికి విరుగుడుగా హైదరాబాద్‌కు చెందిన ఎన్వి రోబోటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ యంత్రాన్ని రూపొందించింది. కృత్రిమ మేధతో పనిచేసే ఈ పరికరం కాలువలో

Updated : 01 Dec 2021 04:13 IST

మురుగు కాలువల్లో పేరుకుపోయే చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం స్థానిక సంస్థల సిబ్బందికి కష్టంతో కూడుకున్న పని. దీనికి విరుగుడుగా హైదరాబాద్‌కు చెందిన ఎన్వి రోబోటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ యంత్రాన్ని రూపొందించింది. కృత్రిమ మేధతో పనిచేసే ఈ పరికరం కాలువలో కొట్టుకొచ్చే వ్యర్థాలను సేకరించి పక్కనే ఉన్న ఇనుప బకెట్లలో వేస్తుంది. బకెట్‌ నిండాక వాటిని మరో చెత్తబుట్టలో వేస్తుంది. విద్యుత్తు సాయంతో ఈ పరికరం నిరంతరాయంగా పనిచేస్తుంది. మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పెద్ద చెరువుకు వెళ్లే మూడు మురుగు కాలువలపై ఈ పరికరాలను ఏర్పాటు చేశారు.   

           

- ఈనాడు, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని