92 మంది ఏపీపీల నియామకం

రాష్ట్రవ్యాప్తంగా 92 మంది అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకం పూర్తయింది. 151 మంది ఏపీపీల నియామకానికి గత ఏడాది మార్చి 27న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో 92 మంది న్యాయవాదులు అర్హత సాధించగా.

Published : 15 Jan 2022 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా 92 మంది అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) నియామకం పూర్తయింది. 151 మంది ఏపీపీల నియామకానికి గత ఏడాది మార్చి 27న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలలో 92 మంది న్యాయవాదులు అర్హత సాధించగా.. తాజాగా వారికి డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జి.వైజయంతి నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరిలో 38 మందిని మల్టీజోన్‌-1లో, 49 మందిని మల్టీజోన్‌-2లో నియమించారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిఫ్‌ కోర్టుల్లో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సంఖ్య 170కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని